వార్తలకు తిరిగి వెళ్లండి
జడ్పీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్

కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వాల్మీకి సామాజికవర్గానికి కేటాయించాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కౌతాళం మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోతులదొడ్డి ఉలిగయ్య భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ఆయనకు పదవి ఇవ్వాలని కోరారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఉలిగయ్య క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు సముచిత గుర్తింపు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
