Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు బంగారు హారం కానుక

Anuroop Nov 13, 2026 3:38 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు బంగారు హారం కానుక - Ushodayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముంబై చెంబూరుకు చెందిన జి.వి. వంశీకృష్ణ శుక్రవారం 38.700 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. దేవస్థానం ఈఓ సీనా నాయక్‌కు హారాన్ని అందజేయగా, అధికారులు రసీదు ఇచ్చారు. దాతకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...