వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో భట్టి దీపావళి

నిరుపేదలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ప్రగతికి అర్థమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదలకు సొంతిల్లు కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని భట్టి తెలిపారు.
Comments
Loading comments...
