వార్తలకు తిరిగి వెళ్లండి
ఈపూరులో రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఈపూరు శాఖా గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20 వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.
20న అక్షరాస్యత దినోత్సవంతో వారోత్సవాలు ముగుస్తాయని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...
