వార్తలకు తిరిగి వెళ్లండి
ఈజిప్టులో రైలు ప్రమాదం.. నలుగురు మృతి
ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక మీడియా 120 మంది గాయపడినట్లు వెల్లడించగా, ఆరోగ్య శాఖ మాత్రం 64 మందికి గాయాలైనట్లు ప్రకటించింది.
గిజా నుంచి ఫయ్యూమ్ వెళ్తున్న రైలు మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి.
Comments
Loading comments...
