Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న నగరంలో ఆటోల బంద్‌

Shruthi Nov 16, 2026 8:28 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఈ నెల 30న నగరంలో ఆటోల బంద్‌ - Ushodayam
15 రోజుల్లో ఆటో మీటర్‌ ఛార్జీలు పెంచడంతో పాటు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని మహాత్మాగాంధీ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ కన్వీనర్‌ మహమ్మద్‌ అమానుల్లాఖాన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న నగరంలో ఒక రోజు ఆటోల బంద్‌ నిర్వహిస్తామని ఆదివారం హైదర్‌గూడలో జరిగిన సమావేశంలో ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...