వార్తలకు తిరిగి వెళ్లండి
గ్యాస్ కనెక్షన్ రద్దుపై ₹20 వేల జరిమానా

ఇల్లు మారిన వినియోగదారుడి ఎల్పీజీ కనెక్షన్ను బదిలీ చేయకుండా ఏకంగా రద్దు చేసిన గ్యాస్ ఏజెన్సీ తీరుపై కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడి పాత కనెక్షన్ను వెంటనే పునరుద్ధరించి కర్నూలుకు బదిలీ చేయాలని ఆదేశించింది.
సేవాలోపానికి పాల్పడిన సదరు ఏజెన్సీ 45 రోజుల్లోగా బాధితుడికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది.
Comments
Loading comments...
