Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌లో ఐదు విల్లాల్లో భారీ చోరీ

Shruthi Nov 24, 2026 8:56 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఘట్‌కేసర్‌లో ఐదు విల్లాల్లో భారీ చోరీ - Ushodayam
మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని జగత్‌స్వప్న గేటెడ్‌ కమ్యూనిటీలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఐదు విల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 40 తులాల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ.1.75 లక్షల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.

Comments

G
Loading comments...