వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఎయిరిండియా విమానంలో హైజాక్ అలర్ట్

కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లేందుకు టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిరిండియా విమానంలో హైజాక్ హెచ్చరిక కలకలం రేపింది. విమానంలోని టాయిలెట్ అద్దంపై బెదిరింపు సందేశం కనిపించడంతో పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన సిబ్బంది టేకాఫ్ నిలిపివేసి విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేపట్టగా, పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
Comments
Loading comments...
