Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి

Anuroop Nov 28, 2026 8:05 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఎస్సై ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి - Ushodayam
275 ఎస్సై (సివిల్) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందే అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా, హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోయినా అనుమతి ఉండదు.

Comments

G
Loading comments...