వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్నికల వేళ కాకినాడలో పోలీసుల నిఘా

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు తన పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, చేయకూడని పనులపై వివరిస్తున్నారు.
పరదేశమ్మపేటలో ప్రజలతో మాట్లాడి వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
