వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌నినో ప్రభావం.. ఆరుతడి పంటలే మేలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ఏవో కృష్ణకుమార్ సూచించారు. నర్సంపేట మున్సిపల్ పరిధి ముత్తోజిపేటలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పెసర, మినుము, శనగ, వేరుశనగ, కుసుమ, ఆముదం వంటి పంటలతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యుడు శ్రవణ్, ఏఈవో అభిద్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
