వార్తలకు తిరిగి వెళ్లండి
ఏన్కూరులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

గార్ల ఒడ్డులో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పుట్టల వద్దకు చేరుకొని నాగేంద్రుడికి పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, పండ్లు, కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించి కుటుంబ క్షేమం, పిల్లల ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యం కోసం ప్రార్థించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
Comments
Loading comments...
