వార్తలకు తిరిగి వెళ్లండి
ఏకగ్రీవ ఎన్నికైతే రూ.70 లక్షల విరాళం

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం టి.సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికపై ఆసక్తికర ప్రకటన వెలువడింది. తన సతీమణి తుమ్మల వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు విరాళంగా ఇస్తానని జనసేనకు చెందిన లక్ష్మీనారాయణ ప్రకటించారు.
గ్రామ పంచాయతీ నిధులతో పాటు ఈ మొత్తాన్ని కూడా అభివృద్ధి పనులకు వినియోగిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
