వార్తలకు తిరిగి వెళ్లండి
దుర్గిలో నాగమయ్య స్వామికి ప్రత్యేక పూజలు

దుర్గి గ్రామంలోని నాగమయ్య స్వామి పుట్ట వద్ద నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...
