వార్తలకు తిరిగి వెళ్లండి
ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చిన వాసవీమాత

కడప జిల్లా వేంపల్లెలోని 122 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దీపావళి పూజలు ఘనంగా నిర్వహించారు. రూ.1.71 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని శ్రీధనలక్ష్మీ దేవిగా అలంకరించారు.
మహిళా మండలి ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకుల నేతృత్వంలో వాసవీ మాతకు ప్రత్యేక అభిషేకాలు, హారతులు సమర్పించారు.
Comments
Loading comments...
