వార్తలకు తిరిగి వెళ్లండి
ధాన్యం కేంద్రాల్లో వసతులు కల్పించాలి: ఎంపీడీవో

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని ఎంపీడీవో శంకర్ నిర్వాహకులకు సూచించారు. గురువారం కథలాపూర్ మండలం పెగ్గెర్ల, ఊటుపెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, ధాన్యం తేమ శాతాన్ని తనిఖీ చేశారు.
ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టాకే కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అనంతరం సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఏ అంబాజీ పాల్గొన్నారు.
Comments
Loading comments...
