Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.4.57 లక్షల మోసం

Anuroop Nov 13, 2026 10:29 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.4.57 లక్షల మోసం - Ushodayam
విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగి డేవిడ్ ఆనంద్‌ను సైబర్ మోసగాళ్లు రూ.4.57 లక్షలు మోసం చేశారు. ఆయన ఆధార్‌పై ఉన్న సిమ్‌తో అశ్లీల వీడియోలు చూడటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని ఫోన్‌లో బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో భయపడి ఆయన నగదు పంపించారు. మోసపోయినట్లు గుర్తించి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...