Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

Shruthi Nov 13, 2026 8:51 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం - Ushodayam
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం తెల్లవారుజామున గాలి నాణ్యత సూచిక 400 దాటింది. ఆనంద్‌ విహార్‌లో అత్యధికంగా 414 నమోదైంది. నోయిడా, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌లోనూ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. పీఎం2.5 కాలుష్య కణాల సాంద్రత జాతీయ సురక్షిత ప్రమాణం కంటే నాలుగు రెట్లు పెరిగింది. పొగమంచు, గాలుల వేగం తగ్గడం, పంట వ్యర్థాల దహనం కాలుష్యానికి కారణమయ్యాయి.

Comments

G
Loading comments...