వార్తలకు తిరిగి వెళ్లండి
డబుల్ రోడ్డు పనులపై యువకుడి నిరసన

గన్నేరువరానికి చెందిన గూడూరు సురేశ్ మంగళవారం జంగపల్లిలో డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కంకర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
దసరా నాటికి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు మొదలుపెట్టలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. నిధులు విడుదలయ్యాయని చెబుతున్నా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని నిలదీశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తానని హెచ్చరించారు.
Comments
Loading comments...
