వార్తలకు తిరిగి వెళ్లండి
చుక్కా రామయ్యకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 101వ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు విద్యార్థులకు ఐఐటీ విద్యను చేరువ చేసిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు.
స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమాల్లో ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. రామయ్య ఆయురారోగ్యాలతో ఉండి తన అనుభవాలను భవిష్యత్ తరాలకు పంచాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
