వార్తలకు తిరిగి వెళ్లండి
చోడవరం శివాలయంలో నాగులచవితి పూజలు

చోడవరంలోని స్వయంభూ గౌరీపరమేశ్వర ఆలయంలో నాగులచవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో వచ్చే నాగులచవితికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అర్చకులు చలపతి తెలిపారు.
వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రాతఃకాలంలో స్వామి దర్శనం, నాగులచవితి పూజలు చేయడం శుభప్రదమని భక్తుల విశ్వాసమని అర్చకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
