Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో ఢిల్లీకి పరకాల నుంచి కార్మికులు

Sai Nath Nov 20, 2026 4:00 PM హన్మకొండ General
Add as a preferred source on Google
చలో ఢిల్లీకి పరకాల నుంచి కార్మికులు - Ushodayam
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ – పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ మేరకు పరకాల మున్సిపాలిటీ తరఫున సీఐటీయూ అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ పోస్టర్ ఆవిష్కరించారు. కనీస వేతనాలు, పెన్షన్ పెంపు, లేబర్ కోడ్‌ల రద్దు, ఉద్యోగ భద్రత కల్పన తదితర డిమాండ్ల సాధనకు ఈ పోరాటం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...