Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలకుంటలో రహదారిపై మురుగునీరు

Kiran Nov 13, 2026 11:56 AM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
చింతలకుంటలో రహదారిపై మురుగునీరు - Ushodayam
కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గుంతల్లో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ మార్గంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో ప్రయాణించాలంటే భయంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...