వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారుల భవితకు తల్లిదండ్రుల భరోసా

పుట్టుకతో వచ్చిన వివిధ రకాల వైకల్య సమస్యలతో మంచానికే పరిమితమైన చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. భవిత కేంద్రాల్లో నిర్వహించే ఫిజియోథెరపీ శిబిరాలకు వారిని తీసుకెళ్లి క్రమం తప్పకుండా చికిత్సలు చేయిస్తున్నారు.
ఇంటి వద్ద కూడా వైద్యుల సూచనల మేరకు నిత్యం వ్యాయామాలు చేయిస్తూ, పిల్లలకు ఏ లోటూ రానీయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
Comments
Loading comments...
