వార్తలకు తిరిగి వెళ్లండి
చిలకలూరిపేటలో పీఏల మధ్య పోరు?

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం తిమ్మాపురంలో టీడీపీ నేతల పీఏల వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉద్రిక్తతలకు దారితీసింది. సర్పంచ్ ఎన్నికల్లో లోకేశ్ పీఏ సాంబశివరావు, బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటీ పడుతున్నాయి.
ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన శ్రీనివాసరావు వర్గాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో 66 మందిని అదుపులోకి తీసుకోగా, లాఠీఛార్జ్ జరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...
