వార్తలకు తిరిగి వెళ్లండి
చికాగోలో కుప్పకూలిన మరో భవనం
అమెరికాలోని చికాగోలో మరో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో సమీపంలో పార్క్ చేసిన కారు నుజ్జునుజ్జయింది. భవనం కూలిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కాగా, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే పెను ప్రమాదం తృటిలో తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
