వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. శిక్షణలో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
శిక్షణలో ఉన్న ఓ జవాను వాహనాన్ని నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. పల్టీలు కొట్టి చెట్టును ఢీకొని ఆగిపోయింది.
Comments
Loading comments...
