వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాలో అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

చైనాలోని తైయువాన్ నగరంలో 40 అంతస్తుల హావోషెంగ్ ఇంటర్నేషనల్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగో అంతస్తులో మొదలైన మంటలు 8, 9 అంతస్తుల్లోని హోటల్‌కు వ్యాపించాయి.
ఫైర్‌ఫైటర్లు 38 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా లోపాలపై విచారణ చేపట్టిన అధికారులు భవన మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
