వార్తలకు తిరిగి వెళ్లండి
బస్సు ఢీకొని మహిళా కార్మికురాలి మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బస్సును పార్క్ చేస్తుండగా డ్రైవర్ పొరపాటున బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో మహిళా కార్మికురాలు భారతి (34)పైకి బస్సు దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పొరపాటున యాక్సిలరేటర్ తొక్కడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారతి అదే డిపోలో పనిచేస్తున్నారు.
Comments
Loading comments...
