వార్తలకు తిరిగి వెళ్లండి
బంజారా భవన్‌కు 2 ఎకరాల భూమికై వినతి

ధూళిమిట్ట మండల కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన ఎస్టీ వింగ్ జిల్లా అధ్యక్షుడు లకావత్ వెంకటేష్ నాయక్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
సేవాలాల్ జయంతి, తీజ్ పండుగతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థలం అవసరమని పేర్కొంటూ ప్రభుత్వం భూమి కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...
