వార్తలకు తిరిగి వెళ్లండి
బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది 48 గంటల్లో వాయుగుండంగా బలపడి, ఆ తర్వాత తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ఈ నెల 14 నాటికి అల్పపీడనం బలపడి, 15న వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో 16వ తేదీ వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
Comments
Loading comments...
