Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో తుపాన్ ముప్పు.. భారీ వర్షాలు

Shruthi Nov 14, 2026 5:08 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
బంగాళాఖాతంలో తుపాన్ ముప్పు.. భారీ వర్షాలు - Ushodayam
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో వాయుగుండం ఏర్పడి, ఈ నెల 16న తుపాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనించి 19వ తేదీ రాత్రి తీరాన్ని చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈ నెల 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు సాయంత్రంలోపు మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Comments

G
Loading comments...