వార్తలకు తిరిగి వెళ్లండి
భూముల రీ సర్వేలో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్

భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో జరుగుతున్న భూముల రీ సర్వేను హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి మంగళవారం పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రైతుల సహకారంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో భూముల కొలతల శాఖ సహాయ డైరెక్టర్ నూర్ సింగ్, తహశీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
