వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రాచలం ఆలయానికి రూ.2.80 లక్షల విరాళం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చిలకమర్రి వైజయంతి రూ.2.80 లక్షలు విరాళంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఆమె రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గోశాలకు రూ.2 లక్షలు, నిత్య అన్నదాన సత్రానికి రూ.80 వేలు ఆలయ అధికారులకు అందించారు.
Comments
Loading comments...
