Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు

Kiran Nov 13, 2026 10:00 AM నిర్మల్ General
Add as a preferred source on Google
బాసర గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి నదీమతల్లికి పసుపు, కుంకుమ, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాలను నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి, ఎస్‌హెచ్‌ఓ సీఐ దీపక్ ఆధ్వర్యంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...