వార్తలకు తిరిగి వెళ్లండి
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగ్గురి మృతి

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చి మృతి చెందారు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్యాంక్‌లో ఊపిరాడక వారు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
