Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోం జైలు నుంచి ఢిల్లీకి పంజాబ్ ఎంపీ

Sai Nath Nov 20, 2026 6:08 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
అసోం జైలు నుంచి ఢిల్లీకి పంజాబ్ ఎంపీ - Ushodayam
నానమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జైలులో ఉన్న పంజాబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌ను శుక్రవారం అసోంలోని దిబ్రూగఢ్ జైలు నుంచి భారీ భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. రాత్రి ఢిల్లీలో ఉండనున్న ఆయన శనివారం ఉదయం అమృత్‌సర్ చేరుకుంటారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జల్లూపూర్ ఖేరా గ్రామంలో తన నానమ్మ చరణ్ కౌర్ అంత్యక్రియల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...