వార్తలకు తిరిగి వెళ్లండి
అశ్వారావుపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

అశ్వారావుపేటలోని షిరిడి సాయినగర్‌లో ఇంటిపై పడిన చెట్టును తొలగించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్కీ అపార్ట్‌మెంట్స్, షిరిడి సాయినగర్, బస్టాండ్ వెనుక బజార్, రెడ్డి మెడికల్ షాప్ ఎదురుబజార్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...
