వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లు దగ్ధం

కుత్బుల్లాపూర్‌లోని స్ప్రింగ్ఫీల్డ్ కాలనీలో అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులోని 404వ ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెసర్లు పేలడంతో మంటలు పక్కనున్న మరో ఫ్లాట్‌కు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో రెండు ఫ్లాట్లలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...
