వార్తలకు తిరిగి వెళ్లండి
అనకాపల్లిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

అనకాపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
పరమేశ్వరి పార్క్ జంక్షన్, సంతోషిమాత ఆలయం, శతకంపట్టు, రింగురోడ్డు, రైతు భారతి కళ్యాణమండపం, బాలకృష్ణ బస్ స్టాప్ తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...
