వార్తలకు తిరిగి వెళ్లండి
అంజమ్మ దేవతకు విశేష పూజలు

గట్టు మండలం ఇందువాసి గ్రామంలోని అంజమ్మ దేవత ఆలయంలో అమావాస్య సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం, అర్చన, ఆకు పూజ, హోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...
