వార్తలకు తిరిగి వెళ్లండి
అంగన్వాడీ పిల్లలకు శిశు ఆధార్ తప్పనిసరి

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు శిశు ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయించాలని పల్నాడు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి సూచించారు. ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టును సందర్శించిన ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నవచైతన్య యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, లబ్ధిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 96 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు మంజూరైనట్లు తెలిపారు.
Comments
Loading comments...
