వార్తలకు తిరిగి వెళ్లండి
అనారోగ్యంతో యువతి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కె.భార్గవి (23) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెడ్డికంచరపాలెం కొత్తవాడ వీధికి చెందిన భార్గవి నేవల్ డాక్‌యార్డ్‌లో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.
మందులు వాడుతున్నా అనారోగ్యం తగ్గకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె, కుటుంబసభ్యులు ఆదివారం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది.
Comments
Loading comments...
