వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతికి బస్సు సర్వీసులు పెంచాలని వినతి

అమరావతికి వివిధ డిపోల నుంచి వచ్చే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి, మంగళగిరి డిపోల నుంచి వచ్చే కొన్ని బస్సుల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.
కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులు పెంచి, సమయపాలనతో నడపాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...
