వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

అమెరికాలో బాంబ్ సైక్లోన్ ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వరదలు, విద్యుత్ అంతరాయాలతో 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. 420 విమానాలు రద్దయ్యాయి.
అట్లాంటిక్ తీరంలోని 25 రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. సుమారు 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. థ్యాంక్స్ గివింగ్ పరేడ్ కూడా వాయిదా పడింది.
Comments
Loading comments...
