వార్తలకు తిరిగి వెళ్లండి
రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం

రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాంపూర్ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేశారు.
సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కులని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగాలని సూచించారు.
Comments
Loading comments...
