వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో నల్గొండ యువకుడు

నల్గొండ జిల్లా కనగల్ మండలం గోగుబుచ్చయ్యగూడెంకు చెందిన 31 ఏళ్ల యర్ర సాగర్‌రెడ్డి ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్రం విలియమ్స్‌టౌన్ నుంచి 'ది రిపబ్లికన్' పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఆరేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన సామాజిక సేవతో గుర్తింపు పొందారు. ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో గెలవాలని స్వగ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Comments
Loading comments...
