Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఎన్నికల్లో ఓటేసిన తొలి పోప్‌గా లియో-14

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:21 PM అంతర్జాతీయంGeneral
అమెరికా ఎన్నికల్లో ఓటేసిన తొలి పోప్‌గా లియో-14 - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పోప్‌ హోదాలో ఓటు వేసిన తొలి వ్యక్తిగా లియో-14 చరిత్ర సృష్టించినట్లు వాటికన్‌ తెలిపింది. ఇల్లినోయీ రాష్ట్రంలో ముందస్తు ఓటింగ్‌లో భాగంగా మెయిల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికాగోలో జన్మించిన రాబర్ట్‌ ప్రివోస్ట్‌ గతేడాది మేలో పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పెరూలో ఉన్నప్పుడూ అమెరికా ఎన్నికల్లో ఓటు వేశారని వాటికన్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...