వార్తలకు తిరిగి వెళ్లండి
అక్కుర్తి వద్ద గంజాయితో ఒకరు అరెస్ట్

శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు అక్కుర్తి రైల్వే గేటు వద్ద నవంబర్ 11న ముచ్చువోలుకు చెందిన బర్రి మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 1,100 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాకు చెందిన శీను వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
